FACT 01:
1960 జూన్ 10న నందమూరి బసవ తారకం, నందమూరి తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ. ఎన్టీఆర్ దంపతులకు ఆరో కొడుకు, పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నందమూరి బాలకృష్ణ.
FACT 02:
తొలినాళ్లతో సహాయ నటుడిగా తండ్రి చిత్రాల్లో నటించిన బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 12 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా చిత్రాల్లో నటించిన బాలయ్య.
FACT 03:
దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో హీరోగా నటించిన బాలకృష్ణ. అందులో 9 చిత్రాలు హిట్టైయితే.. 4 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు. అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
FACT 04:
బాలకృష్ణ సింహం పేరు కలిసొచ్చేలా ‘సింహం నవ్వింది, ‘బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా వంటి 8 చిత్రాల్లో నటించారు.
FACT 05:
బాలకృష్ణ 25వ చిత్రం నిప్పులాంటి మనిషి ఎస్.బి.చక్రవర్తి డైరెక్ట్ చేసారు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’ ఏ. కోదండరామిరెడ్డి డైరెక్డ చేసారు. 75వ చిత్రం కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ డైరెక్ట్ చేసారు