in

eesha rebba sensational comments on telugu heroines!

అరవింద సమేత’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపును  సంపాదించుకున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా. హీరోయిన్, సెకండ్ హీరోయిన్ పాత్రలతో ఆమె బిజీగా ఉంది. ప్రస్తుతం ‘మాయా మశ్చీంద్ర’ ‘దయా’ చిత్రాల్లో నటిస్తోంది. ఇతర భాషల వాళ్లు తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంటుందని ఈషా చెప్పింది. అయితే టాలీవుడ్‌లో మాత్రం తెలుగమ్మాయిల కంటే పరాయి వాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

తాను ఇతర భాషా చిత్రాల్లో నటించినప్పుడు అక్కడి వాళ్లంతా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకోవడం గర్వంగా అనిపించేదని చెప్పింది. అయితే తెలుగులో మాత్రం పరభాషా నాయికలనే ఎక్కువగా తీసుకుంటారని తెలిపింది. ‘ఇతర భాషల కథానాయికలు మాత్రమే కావాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేయరు కదా? అలాంటప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాదు’ అని ఈషా రెబ్బ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది..!!

Rangabali!

pooja hegde to sizzle opposite Mahesh in an item song?