

సంచలనాత్మక డైరెక్టర్ రాజమౌళి గారు మర్యాద రామన్న సినిమా తరువాత,తన కెరీర్ లో ఎప్పుడు చెయ్యలేనటివంటి ఒక భారీ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు,అదే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రైడ్ బాహుబలి.అయితే,బాహుబలి మొదలు అవ్వడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో టైమ్ వేస్ట్ చెయ్యడం ఎందుకు అని ఎప్పటినుండో తన నాన్న గారితో డిస్కషన్ లో ఉన్న ఈగ సినిమా స్టోరీ తెరకెక్కిదాం అనుకున్నారు.కానీ సమయం చాలా తక్కువగా ఉండటంతో,ఒక మామూలు డిజిటల్ హ్యాండీ కెమెరా యూజ్ చేసి తక్కువ బడ్జెట్ లో లిమిటెడ్ ఆడియెన్స్ కోసం సినిమా తీద్దాం అనుకున్నారు.ఈ ఈగ విషయం తెలుసుకున్న సురేష్ బాబు గారు రాజమౌళి తో కథ ముందు రాయండి బడ్జెట్ గురించి తరువాత ఆలోచిద్దాం అన్నారట.కథ పూర్తయ్యాక ఆధి విన్న అందరూ ఈ కథ కచ్చితంగా తెరకు ఎక్కల్సిందే అని ఎక్సైట్మేట్ తో రాజమౌళి గారితో అన్నారట. సినిమా స్టార్ట్ అయ్యాక లో బడ్జెట్ లిమిటెడ్ కాస్ట్,నాలుగు నెలల్లో చెయ్యాలి అన్ని ఎగిరిపోయాయి అంట.మూడు కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త ముప్పై కోట్లు అయింది,రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకం తో ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయం లో అస్సలు రాజీ పడలేదు. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ కావడంతో దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసింది.జక్కన నీ నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నష్టం రాదు అని మళ్ళీ ప్రూవ్ చేశారు . నిజంగా రాజమౌళి గారు తెలుగు సినిమా కి దొరికిన అదృష్టం అనే చెప్పాలి.