ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’’, అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘‘ఆచార్య’’, ఇళయ దళపతి విజయ్ ‘‘బీస్ట్ ’’ ఈ మూడు పాన్ ఇండియా చిత్రంలో పూజానే హీరోయిన్ గ చేసింది. ఇవి కాకుండా పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాళీ’, రోహిత్ శెట్టి సరసన ‘సర్కస్’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ ఏడాది ఆమె కెరీర్‌లో గోల్డెన్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే సినిమాలకు సంబంధించిన జయాపజయాలను పక్కన పెడితే, తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం దక్కింది. హాలీవుడ్ దిగ్గజాలు, ఇంటర్నేషనల్ మీడియా సమక్షంలో పూజా హెగ్డే తెల్లటి అందమైన గౌనులో రెడ్ కార్పెట్‌పై చిరునవ్వులొలికిస్తూ వాక్ చేసింది..ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. భారతీయ యువతులు పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు. తాను మహిళల కోసం కొన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు పూజా తన మనసులోని మాట చెప్పారు.
మనదేశంలో మహిళలకు తగిన ప్రాతినిథ్యం లేదని .. ఏదైనా సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లోని మహిళను చూసినప్పుడు, ఆడపడుచులు ఆ పాత్రను అనుకరించాలని భావిస్తారని… తాము కూడా అలా ఎందుకు కాకూడదనే ఆలోచన వారిలో మొదలవుతుందని పూజా వ్యాఖ్యానించారు. భారతదేశంలోని అమ్మాయిలు పెద్ద కలలు కనేలా.. వారి అంతర్గత సామర్ధ్యాన్ని వెలికితీసేందుకు స్పూర్తినిచ్చే విషయంలో తాను కూడా చిన్న భాగం కావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్కార్ విజేత బాంగ్ జూన్ హోను ఉద్దేశించి పూజా మాట్లాడుతూ.. మనం భాషలను అడ్డంకిగా చూడటం మానేయాల్సిన సమయం వచ్చిందన్నారు.