గుంటూరు కారం’ లో మహేష్ ఒత్తిడి వలనే త్రివిక్రమ్ సెక్సీ బ్యూటీ పూజ హెగ్డే ను ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చిందట. గతంలో మహేష్, పూజా కలిసి మహర్షి అనే సినిమాలో నటించారు. మరి.. ఈ సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఆమె పై వ్యతిరేకత వచ్చిందో తెలియదు. ఆమెకు ఈమధ్య సక్సెస్ లేదు. ఆ కారణంగానే మహేష్ పూజాను తప్పించమన్నారేమో అని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ కష్టకాలంలో ఈ సినిమా తనకి ఎంతగానో ఉపయోగపడుతుందని..మళ్లీ ఈ సినిమాతో కెరీర్ లో మంచి ఊపు వస్తుందని అనుకుందట.
ఇప్పుడు ఇలా ఈ మూవీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో బాగా ఫీలవుతుందట. ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. అందుకనే మిడ్ రేంజ్ హీరోలతో నటించాలనుకుంటుందని టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా ముందుగా పూజాను అనుకున్నారు కానీ తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ గుంటూరు కారం నుంచి తప్పుకోవాల్సివచ్చింది. విజయ్ దేవరకొండతో జనగణమన చేయడానికి ఓకే చెబితే ఆ ప్రాజెక్టే ఆగిపోయింది. పాపం.. పూజా టైమ్ అస్సలు బాలేనట్టుంది. మళ్లీ ట్రాక్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి..!!