in

Dushara Vijayan: felt scared to work with Rajinikanth sir

సూపర్‌స్టార్‌ రజనీకాంత్  హీరోగా దర్శకుడు టీజే ఙ్ఞానవేల్ రూపొందిస్తున్న ‘వేట్టయ్యన్‌’ లో యువ నటి దుషార విజయన్ గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించుకుంది. ఇటీవ‌లే సినిమాలో త‌న పార్ట్‌ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసింది. ఈ అవకాశంపై ఆమె స్పందించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అ షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన త‌న‌ అనుభవాల‌ను పంచుకుంది..‘వేట్టయ్యన్‌’ చిత్రంలో తలైవర్‌తో కలిసి నటించాననే గర్వంతో పాటు భయం ఏర్పడింది..

షూటింగ్‌కు ముందు రోజు ఏకంగా జ్వరమే వచ్చింది. ఆయనతో కలిసి నటించే సమయంలో ఒక వైపు జ్వరం, మరోవైపు ముచ్చెమటలు పట్టాయని తెలిపింది. పట్టరాని సంతోషం..మరోవైపు భయం, ఆందోళన. ఈ రెండింటిని ఏక కాలంలో అనుభవించాను. అలాంటి మానసికస్థితిలో రజనీతో కలిసి నటించాను. ఇది ఒక కలగానే ఉంది. అలాగే, ఫహద్‌ ఫాజిల్‌తో కలిసి ‘వేట్టయ్యన్‌’ కోసం కలిసి చేయడం కూడా గొప్ప అనుభూతిగా ఫీలవుతున్నాను. అందుకే ‘రాయన్‌’ తరహాలోనే ‘వేట్టయ్యన్‌’ మూవీ కూడా నా కెరీర్‌లో నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు..!!

Konidela Sivasankara Varaprasad nu megastar ga marchina illu!

Here’s the Truth Behind Car Accident Rumours!