హిందీ చిత్ర సీమలో” డ్రీం గర్ల్ ” గ వెలుగొందిన హేమ మాలిని గారు మొట్ట మొదటిగా వెండి తెర మీద కనిపించింది మాత్రం తెలుగు సినిమాలోనే. ఆదుర్తి సుబ్బా రావు గారు అంతా కొత్త నటి నటుల తో నిర్మించిన ” తేనే మనసులు ” చిత్రం అడిషన్స్ లో హేమ మాలిని ని తిరస్కరించారు, ఆ చిత్రం ద్వారానే హీరో కృష్ణ హీరో అయ్యారు. డైరెక్టర్ కమలాకర కామేశ్వర రావు గారు ” పాండవ వనవాసం” అనే చిత్రం నిర్మిస్తున్నారు, హేమ మాలిని మంచి నర్తకి అని తెలుసుకున్న అయన ఆమెకు అవకాశం ఇచ్చి ఆమె మీద ఒక నృత్యాన్ని చిత్రీకరించారు.
పాండవ వనవాసం హేమ మాలిని మొదటి సినిమా అని చెప్ప వచ్చు. ఆ తరువాత హేమ మాలిని గారు హిందీ చిత్ర సీమలో స్థిరపడి డ్రీం గర్ల్ గ నీరాజనాలు అందుకుంటున్న సమయం లో 1975 లో కమలాకార కామేశ్వర రావు గారు శ్రీ కృష్ణ విజయయం అనే పౌరాణిక చిత్రం నిర్మిస్తూ ఆ చిత్రం లో “రంభ” క్యారెక్టర్ కోసం హేమ మాలిని గారిని సంప్రదించారు. డైరెక్టర్ గారి మీద ఉన్న కృతజ్ఞత తో ఆమె ఆ క్యారెక్టర్ అంగీకరించారు. శ్రీ కృష్ణ విజయం చిత్రంలో రంభ గ “జోహారు శిఖి పింఛ మౌళి” అనే పాటకు నాట్యం చేసారు. ఆమె తెలుగులో నటించిన రెండు పాత్రలు కమలాకర కామేశ్వర రావు గారి చిత్రాలు కావటం విశేషం.