శేఖర్ కమ్ముల , తన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్స్ తో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గ నేషనల్ అవార్డు సాధించిన విలక్షణమయిన డైరెక్టర్ . డాలర్ డ్రీమ్స్ కధ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుట్టిందో చాల ఇంట్రస్టింగ్ గ ఉంటుంది, మీరు కూడా చదవండి. ఫిలిం మేకింగ్ లో హార్వార్డ్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన శేఖర్, అక్కడే ఆనంద్ సినిమా కధ రెడీ చేసుకొని ఇండియా కి వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ గ చేరాలని ప్రయత్నం మొదలు పెట్టారు ఎక్కడ అవకాశం చిక్క లేదు, ఆ టైం లోనే గయినాకాలోజిస్ట్ అయినా ఆయన అక్క గారి హాస్పిటల్ కు వెళ్లిన శేఖర్ కు ఒక ఆవిడా అబార్షన్ చేయుంచుకోవటానికి వచ్చింది, ఆవిడ అమెరికా వెళుతుంది అక్కడే బిడ్డను కంటే అక్కడి సిటిజెన్షిప్ వస్తుంది అందుకని అబార్షన్ చేయించుకుంటున్నదీ.
ఆ సంఘటన చూసిన శేఖర్ మనసులో, డాలర్ డ్రీమ్స్ కధ కు బీజం పడింది, డాలర్ కలలో ఎంత మంది ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, అనే అంశం తో డాలర్ డ్రీమ్స్ కధ రూపుదిద్దుకొనింది, స్నేహితుల సహకారం తో అమిగోస్ అనే పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి, 18 లక్షల పెట్టుబడి తో, 18 రోజులలో సినిమా పూర్తి చేసి కేవలం 5 ప్రింట్స్ తో సినిమా రిలీజ్ చేసారు, ఆలోచన పరులు ఇతనెవరో బలే తీసాడే అనుకున్నారు, ఆర్ధికం గ గూబ గుయ్యి మనింది, కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గ నేషనల్ అవార్డు రావటం సినిమా రంగం ఒక్కసారిగా ఎవరబ్బా శేఖర్ అనే ఒక గుర్తింపు తెచ్చిన సినిమా అయింది.