డీజే టిల్లు సినిమాతో యూత్ కి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో గురించి ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. సిద్దు జొన్నలగడ్డ ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి హ్యాండ్ ఇచ్చారట. బంగార్రాజు ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఓకే చేశారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి కొడుకు పాత్రలో నటించేందుకు సిద్దు జొన్నలగడ్డకు అవకాశం వచ్చిందని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది.
ఈ సినిమాలో నటించేందుకు సిద్దు ఏకంగా 4 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అంత సెట్ అయిందనుకునే లోపే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ పాత్ర చేయడానికి సిద్దు జొన్నలగడ్డ ఆసక్తి చూపించడం లేదనే న్యూస్ బయటకి వచ్చింది. దీంతో మరో యంగ్ హీరో కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అన్వేషణ ప్రారంభించారట. ఈ పాత్రలో మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ ని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సిద్దు జొన్నలగడ్డ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది.