in

divi expressed her interest on dating with prabhas!

ప్ప‌టికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్ర‌భాస్ అమ్మాయిల దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉన్నాడు. మిర్చి కుర్రాడికి రోజురోజుకు అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. అయితే ప్ర‌భాస్‌కి ఫ్లాట్ అయిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా ఉంద‌ట‌. ఈ అమ్మ‌డు తాజాగా ఇచ్చిన యూ ట్యూబ్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌పై త‌న‌కున్న ఇష్టాన్ని వ్య‌క్త‌ప‌రిచింది.

బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న దివి అంత‌క‌ముందు మ‌హ‌ర్షి సినిమాలో న‌టించింది. ఇప్పుడు ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అందరిలాగే నాకు ప్రభాస్ అంటే క్రష్. ఆయన మూవీస్ చూస్తున్నా.. నచ్చుతున్నాడు, ఇంకా నచ్చుతున్నాడు. నాకెలాగైతే ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వస్తాయో నేను కూడా ప్రభాస్‌‌కి అలాగే ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాను అని పేర్కొంది.

ఐ ల‌వ్ సో మ‌చ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌భాస్‌కి ప‌లు మెసేజ్‌లు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. ఒకవేళ ఆయన కలిస్తే ఓ డీసెంట్ డేట్ అడుగుతా. మిర్చి లాంటి కుర్రోడితో కలిసి ఓ కాఫీ తాగితే చాలు. నాకు తెలిసి ఆ రోజు వస్తుంది. ఆయన్ను తప్పకుండా కలుస్తా అని దివి తన మనసులో మాట చెప్పింది. ఇక నాగార్జున‌ని ప్రేమిస్తాన‌ని చెప్పిన దివి ..ప్రభాస్‌కి పెళ్ళాం లేదు, అలాగే రామ్‌కి కూడా పెళ్ళాం లేదు కాబట్టి ఇద్దరిలో ఎవ్వరైనా ఓకే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది దివి.

Mouni Roy flaunts her killer body curves!

Nabha Natesh bags a chance to act with Hrithik roshan!