in

director wants a special song with vijay devarakonda’s bestie?

విజయ్ దేవరకొండతో రష్మిక మండన్నకి ఎఫైర్ నడుస్తోందన్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ‘ఖుషీ’ సినిమా పుణ్యమా అని, ఈ పుకార్లలోకి సమంత పేరు కూడా గట్టిగానే లాగేయబడింది. తనకు విజయ్ మంచి స్నేహితుడని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది రష్మిక. సమంత సంగతి సరే సరి. కష్ట కాలంలో తనకు సపోర్టివ్ సిస్టమ్‌లా విజయ్ వ్యవహరించాడని సమంత చెప్పుకొచ్చింది. సినీ రంగంలో ఈ స్నేహాలు కొత్తేమీ కాదు. అసలు విషయంలోకి వస్తే, విజయ్ దేవరకొండ కొత్త సినిమా, సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ వెల్లడించారు కూడా.

మృనాల్ ఠాకూర్ హీరోయిన్..పరశురామ్ దర్శకుడు..ఈ సినిమా కోసం ఇటు రష్మికతోనూ అటు సమంతతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయట. అదీ, ఓ స్పెషల్ సాంగ్ కోసమట. ఇప్పటికే సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయ్యింది. సమంత లేదా రష్మిక..ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పెషల్ సాంగ్ చేస్తే, సినిమా రేంజ్ వేరే లెవల్‌కి వెళుతుందన్న భావనతో వున్నాడట దర్శకుడు పరశురామ్ పెట్ల. అయితే, ఈ విషయమై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. సమంత గతంలో ‘పుష్ప ది రైజ్’ సినిమా కోసం స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే..!!

2 Young Heroines In Nagarjuna’s Naa Saami Ranga?

meenakshi chowdary on board for kollywood’s star hero?