వర్ధమాన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పేరు ఇంగ్లీష్ లో ఇలా వ్రాస్తారు , Tharun Bhascker Dhaassyam ఇలా ఎందుకు వ్రాస్తారు అంటే భాస్కర్ నాన్న గారు, న్యూమరాలజీ, జ్యోతిష్యం మీద చాల గురి ఉన్న వ్యక్తి, భాస్కర్ వాళ్ళ నాన్న తో ఆ విషయం లో కొంత ఆర్గుమెంట్ చేసే వారట. కానీ భాస్కర్ నాన్న గారు పోయిన తరువాత భాస్కర్ జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలు, యాదృచ్చికమా లేక వారి నాన్న గారు చెప్పినట్లే జరుగుతున్నాయా అనే సందిగ్ధం లో పడిపోయారు తరుణ్ భాస్కర్ కూడా. ఆయన మొదటి చిత్రం అయిన పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్ బర్త్ డే అయిన నవంబర్ 5 వ తారీకు కు 100 డేస్ పూర్తి చేసుకోవటం, ఫిబ్రవరి 19 వ తారీఖున నేషనల్ అవార్డు కోసం ప్రీమియర్ వేయటం, ఆ రోజు భాస్కర్ నాన్న గారి సంవత్సరీకం.
మే 3 వ తారీకు ప్రెసిడెంట్ చేతుల మీదుగా బెస్ట్ డైరెక్టర్ గ నేషనల్ అవార్డు అందుకున్నారు, ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న ల పెళ్లి రోజు కావటం యాదృచ్చికం అనుకోవచ్చు మనం, కానీ తరుణ్ భాస్కర్ మాత్రం వాళ్ళ నాన్న గారు అన్న మాట ప్రకారం అన్ని జరుగుతున్నాయేమో అన్న ఒక నమ్మకం ఏర్పడటం మొదలైనది. ఒక తండ్రి గ తరుణ్ భాస్కర్ వెన్ను తట్టి ముందుకు నడిపించిన నాన్న తన విజయం చూడటానికి లేక పోవటం నిజం గ బాధాకరం. కానీ వారు ఎక్కడ ఉన్న వారి అశీసులు భాస్కర్ కి పుష్కలంగా ఉన్నాయి అనటానికి ఈ వరుస సంఘటనలు ఉదాహరణ గ చెప్పవచ్చు.