మా అన్నయ్య చిత్రం హీరో రాజశేఖర్, డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య కు నో చెప్పారు, రవిరాజా పినిశెట్టి కి ఒకే చెప్పి నిర్మాతలను ఇరకాటంలో పెట్టారు. రాజశేఖర్ గారు అంతకు ముందే ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో “మనసున్న మారాజు” చిత్రం పూర్తి చేసారు, తదుపరి చిత్రం గ తమిళంలో సూపర్ హిట్ అయినా చిత్రం హక్కులు కొన్న నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సింగనమల రమేష్ ముత్యాల సుబ్బయ్య దగ్గరకు వచ్చి డైరెక్షన్ చేయమని అడిగారు, సుబ్బయ్య గారు ఆ సినిమా కు ” మా అన్నయ్య” అని నామకరణం చేసి, ఒక మంచి రోజు చూసి సినిమా ప్రారంభం చేసారు. ఇది జరిగిన కొన్ని రోజులకు నిర్మాతలు సుబ్బయ్య గారి వద్దకు వచ్చి గురువు గారు మేము వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటున్నాము మీరు కొంచెం అర్ధం చేసుకోవాలి అన్నారు. అదేమిటి సర్ అనౌన్స్ చేసాక ఇలా చేస్తే నాకు ఇబ్బ్బంది కదా అన్నారట,
ఏం చేయమంటారు గురువు గారు హీరో గారు డైరెక్టర్ ని మార్చమని పట్టుపడుతున్నారు అన్నారట, ఒక్క సారిగా ఆశర్య పోయిన సుబ్బయ్య గారు, చేసేది ఏమి లేక సరే అన్నారు. రాజశేఖర్ గారు ఆలా ఎందుకు చేసారో అర్ధం కాకా మౌనం గ ఉండి పోయారు. ప్రారంభం నుంచి తనను ఎంతో ఎంకరేజ్ చేసిన రాజశేఖర్ ఆలా ఇందుకు చేసారో అర్ధం కానీ సుబ్బయ్య గారు, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ డైరెకర్స్ అసోసియేషన్ కి లేఖ రాసారు, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలతో మాటలాడి సుబ్బయ్య గారికి నష్ట పరిహారం ఇప్పించారు. అంతటితో ఆ వివాదం సమసి పోయింది. ఇటువంటి వివాదాలు సినీ పరిశ్రమలో సర్వసాధారణమ్. ఆ తరువాత రాజశేఖర్ గారు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో చిత్రం చేయలేదు.