తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ సినిమాలో తన అందంతో పాటు అభినయంతోనూ మంచి మార్కులు కొట్టేసింది కృతి. ఒక్క సినిమాతోనే ఏకంగా అభిమాన సంఘాలు కూడా వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో సింగిల్ సినిమాతో ఇంత క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మరొకరు లేరంటే నమ్మశక్యం కాదేమో..? అలాంటిది ఇప్పుడు ఈ హీరోయిన్‌ను ఓ దర్శకుడు అందరి ముందు తిట్టేసాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం షూటింగ్ జరుగుతుంది. అందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి, నాజర్ కీలక పాత్రలు పోషిష్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ మధ్యే మొదలైంది. తాజాగా జరిగిన షెడ్యూల్‌లో కృతి శెట్టిపై లింగుస్వామి ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. నాజర్ కాంబినేషన్‌లో ఓ ఎమోషనల్ సీన్ చేస్తున్నపుడు కృతి సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదని.. దాంతో సీనియర్ నటుడు అసహనానికి లోనయ్యాడని తెలుస్తుంది. దాంతో అక్కడే ఉన్న దర్శకుడు లింగుసామి కూడా ఈ హీరోయిన్‌పై కాస్త కసురుకున్నాడని..సెట్‌లో అందరి ముందే కోపగించుకున్నాడని ప్రచారం జరుగుతుంది. గంట పాటు ఎన్నో రీటేక్‌లు తీసుకున్నప్పటికీ సీన్ ఓకే కాకపోవడంతో నాజర్, లింగుసామి కాస్త డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది.