in

Did Sai Pallavi not match Prabhas height for ‘Salaar’ heroine?

ప్రభాస్ నటించే పాన్ ఇండియా సినిమా సలార్‌లో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించినా కాస్త వింతగా అనిపిస్తాయి. అలాంటి కాంబోనే ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ వార్త రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించి వచ్చింది. తన పక్కన సాయిపల్లవి పక్కాగా సూటవుతుందని, కాకపోతే కాస్త హైట్ ప్రాబ్లమ్ అవుతుందని ప్రభాస్ అన్న మాటలే ఈ వార్తకు దారితీశాయి.

ఈ కాంబో సెట్ అవుతుందో లేదో కానీ సినీ వర్గాల్లో మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ఇంతటి దుమారం లేపాయి. కానీ సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం దీనిపైనే దృష్టి పెట్టాడు. దాంతో సలార్ సినిమాలో చేయబోయే ఇద్దరు హీరోయిన్‌లలో ఒకరిగా సాయిపల్లవిని తీసుకోనున్నాడట. ఇదే గనుక నిజమైతే సాయి పల్లవి నటించే మొదటి పాన్ ఇండియా చిత్రం సలార్ అవుతుంది..

kiara advani goes to Maldives with her rumored boyfriend!

ott platform ‘aha’ says sorry to chiranjeevi fans!