ఒకప్పుడు అక్కనేని కోడలు సమంత. ఏ కార్యక్రమంలో అయినా అక్కినేని కుటుంబం గురించి సమంత గొప్పగా చెప్పేది. ఆ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టడం తన అదృష్టమనేది. అక్కినేని ఫ్యామిలీ కూడా అంతే. సమంతని చూసి పొంగిపోయేది. కానీ ఇప్పుడు ఆ అనుబంధం లేదు. దానికి కారణం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత – నాగచైతన్య విడిపోయారు. అందుకే సమంత పేరెత్తడానికి కూడా..అక్కినేని కుటుంబం ఆలోచిస్తోంది. ఇలాంటి తరుణంలో సమంత అనారోగ్యం పాలైంది. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ప్రస్తుతం చికిత్స తీసుకొంటున్నానని సమంత స్వయంగా ప్రకటించింది. దాంతో సమంతపై సానుభూతి వ్యక్తమవుతోంది. సినీ లోకమంతా సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేస్తోంది. సమంతకు ధైర్యమిస్తూ..ట్వీట్లు పెడుతోంది.
ఆఖరికి అఖిల్ కూడా సమంత కోరుకోవాలంటూ సోషల్ మీడియాలో సందేశం ఉంచాడు..ఇప్పుడు నాగచైతన్య సమంతని కలవాలని భావిస్తున్నట్టు టాక్. సమంత చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి స్వయంగా కలసి రావాలనులకొంఉటన్నాడట. అందుకే చైతూ ట్వీట్ కూడా చేయలేదని తెలుస్తోంది. ఎంతైనా.. ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. అభిరుచులు నచ్చే పెళ్లి చేసుకొన్నారు. కా తరవాత మనస్పర్థలు వచ్చాయి. దాంతో గౌరవంగానే విడిపోయారు. తమ మధ్య ఏం జరిగినా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమంతకు అండగా ఉండాలని అక్కినేని కుటుంబం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే చైతూ ఒక్కడే కాదు… అక్కినని కుటుంబమంతా.. ఆసుపత్రికి వెళ్లి సమంతకు ఓదార్చి రావాలని అనుకొంటున్నార్ట. అదే జరిగితే..సమంత – అక్కినేని కుటుంబం మధ్య గ్యాప్ కొంత తగ్గినట్టే..!!