
సంక్రాంతి సందడిలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత దర్శకుడు బాబీతో ఆయన మళ్ళీ జతకట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన చిరంజీవి కూతురి పాత్ర కోసం ఒక టాలెంటెడ్ నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎమోషనల్ పాత్ర కోసం చిత్ర బృందం చాలా మందిని పరిశీలించినా, చివరకు సారా అర్జున్ వైపు మొగ్గు చూపారు. ‘పొన్నియిన్ సెల్వన్’లో తన నటనతో ఆకట్టుకున్న సారా, ఇటీవలే హిందీ చిత్రం ‘ధురంధర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఈ పాత్రకు ప్రాణం పోస్తాయని దర్శకుడు బాబీ నమ్ముతున్నారు..!!
