in

devara’s girl Janhvi Kapoor in Nani’s next?

నాని – జాన్వీ క‌పూర్ జంట‌గా ఓ సినిమా రాబోతోందంటూ చిత్ర‌సీమ‌లో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే దీనిపై నాని స్పందించాడు. ”అది రూమ‌ర్ మాత్ర‌మే” అని కొట్టి పారేశాడు. అక్క‌డితో ఆగితే… అది నిజంగానే నిజం కాదేమో అని ఫిక్స‌యిపోయేవాళ్లంతా. కానీ ”మా చిత్ర‌బృందం ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతోందేమో నాకు తెలీదు. ‘స‌రిపోదా శ‌నివారం’ షూటింగ్ బిజీలో నేను ఆ ప్రాజెక్ట్ గురించి ప‌ట్టించుకోలేదు” అంటూ ముక్తాయింపు ఇవ్వ‌డం కొత్త క‌న్‌ఫ్యూజ‌న్‌కి దారి తీస్తోంది.

నానికి తెలియ‌కుండా సినిమాలో హీరోయిన్‌ని ఫిక్స‌వ్వ‌డం, ఆమెను సంప్ర‌దించ‌డం జ‌రిగే విష‌యాలు కావు. జాన్వీని సంప్ర‌దిస్తే అది నానికి తెలిసే జ‌రుగుతుంది. ఈ విష‌యంలో ఎలాంటి డౌటూ అవ‌స‌రం లేదు. నిజానికి జాన్వీ అయితే బాగుంటుంద‌ని టీమ్ మొత్తం ఫిక్స‌య్యింది. ఆమెతో మాట్లాడింది కూడా. అయితే.. ‘దేవ‌ర‌’ బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ నాని అండ్ టీమ్ వెయిట్ చేద్దామ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం..!!

Samantha hails WCC’s efforts that led to Hema Committee!

Puri Jagannadh to sell valuable property to cover Double iSmart losses?