సీరియల్ నటి దీపిక రంగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ మా ఛానల్ లో ఈ చిన్నది నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ చిన్నది వివిధ ప్రోగ్రామ్ లలో పాల్గొంటూ తన చలాకీతనం, మాటలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడి చూపును తన వైపుకు తిప్పుకుంది. దీంతో ఈ చిన్నదానికి విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. సోషల్ మీడియాలోనూ దీపికకు విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు.
తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా..ఈ చిన్నది రీసెంట్ గా కిసిక్ టాక్స్ షోలో పాల్గొంది. అందులో వర్షాతో సరదాగా మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది. ఆన్ స్క్రీన్ లో రొమాంటిక్ సన్నివేశాలలో నటించే అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తావు అనే వర్ష అడగగా ఏ హీరోతో అయినా చేస్తాను అంటు దీపికా సమాధానమిచ్చింది. విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ చేసే అవకాశం వస్తే తానే బాగా కిస్ పెడతాను అంటూ దీపిక హాట్ కామెంట్స్ చేసింది..!!