పూజా హెగ్డేకు హత్యా బెదిరింపులు అనే వార్త సినీ సర్కిల్లో సంచలనం సృష్టించింది. ముందుగా ఒక పాపులర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ విషయాన్ని పోస్ట్ చేయగా..కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం పూజా దుబాయ్ వెళ్లగా..అక్కడే ఏదో గొడవ జరిగిందని, తను బెదిరింపులకు గురయ్యిందని ఆ పోస్ట్‌లో ఉంది. దీంతో పూజా ఫ్యాన్స్ కలవరపడ్డారు. జాగ్రత్తగా ఇండియాకు తిరిగిరమ్మంటూ ఆ పోస్ట్‌కు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
క్లబ్ ఓపెనింగ్ కోసం పిలిచినప్పుడు తిరిగి జాగ్రత్తగా పంపించే బాధ్యత ఉండదా అంటూ మరో ఫ్యాన్ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి పలువురు పూజా హెగ్డేను కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి తన టీమ్ ముందుకొచ్చింది. ‘‘ఈ వార్తను ఎవరు మొదలుపెట్టారో తెలియదు. కానీ ఇది అస్సలు నిజం కాదు. అసలు అలాంటి సంఘటన ఏమీ జరగలేదు’’ అంటూ పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది..!!