భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు..ఆమె మాట్లాడుతూ..రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ”డియర్ మేఘ” విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో నెర్వస్ గా కూడా అనిపిస్తోంది. చాలా రోజుల క్రితం నన్ను కాంటాక్ట్ చేసేందుకు దర్శకుడు సుశాంత్ రెడ్డి చాలా రోజులు ట్రై చేశారు.
చివరకు నా నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి ఇలా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉంది అని చెప్పారు. నాకు మొదట్లో భయమేసింది. ఫీమేల్ సెంట్రిక్ అంటే చాలా ప్రెజర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్ కు తప్పకుండా రిస్క్ చేయాలి, కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి అనుకున్నాను. డియర్ మేఘ కథ విన్నప్పుడు చాలా రొమాంటిక్, ఎమోషనల్, లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.