in

dasari blockbuster cinema nu vadulukunna shobhan babu!

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులకి సినిమా ఛాన్స్‌‌లు ఇవ్వాలంటే కొద్దిగా బయపడుతుంటారు స్టార్ హీరోలు.. ఇది ఇండస్ట్రీలో సహజమే కూడా.. సరిగ్గా మూవీ లెజెండ్ దాసరి విషయంలో కూడా జరిగిందట. దాసరి దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘తాతమనవడు’ .. ఎస్వీ రంగారావు, రాజబాబు ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమాని ముందుగా అప్పటికీ స్టార్ హీరో అయిన శోభన్ బాబుతో చేయాలనీ అనుకున్నారట దాసరి. రాజబాబు పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట దాసరి. అయితే దాసరి అప్పటికి కొత్త దర్శకుడు కావడంతో సినిమాని వదులుకున్నారట శోభన్ బాబు..

దీనితో రాజబాబుతో ఆ పాత్రను చేయించారు దాసరి. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని సందేశం ఇస్తూ తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ఏకంగా నంది అవార్డు కూడా లభించింది. ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు గాను శోభన్ బాబు అప్పట్లో చాలానే బాధపడ్డారట. అయితే ఈ సినిమా తర్వాత శోభన్ బాబు, దాసరి కాంబినేషన్ లో అనేక చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘బలిపీఠం’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అభిమన్యుడు, దీపారాధన, కృష్ణార్జునులు, స్వయంవరం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి చిత్రాలు వచ్చి మంచి సక్సెస్ లను అందుకున్నాయి..

pavani reddy at ‘moodu puvvulu aaru kayalu’ audio launch!

Lakshya!