సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైందని చెప్పాలి. ఎక్కడ ఎం జరిగిన అచిటికెలో అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా ద్వార సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సినిమాల్లో సన్నివేశాలను జోడించి…హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ ఏవైర్నెస్ చేస్తున్నారు. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోండి బాలరాజు గారు ఎలాంటి కబురు వినాల్సిన అవసరం ఉండదు అంటూ ఫన్నీ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు పోలీసులు.
తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జెర్సీ సినిమాలో నాని బైక్ నడుపుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. సినిమాలో నాని కొడుకు “నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న .. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో” అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈపోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు…