in

city police impose fine to Allu Arjun and Kalyan Ram!

ప్రతి రోజూ ఇలా వేల మంది ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే సెలబ్రిటీలు ఇలా దొరకడం, వాళ్లకు పోలీసులు ఫైన్‌ విధించడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిదే శనివారం రాత్రి జరిగింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ల కార్లకు పోలీసులు ఫైన్‌ వేశారు..శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వీటిలో జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర్లోని పాయింట్‌ కూడా ఉంది.

ఈ డ్రైవ్‌ సందర్భంగా కార్లపై నకిలీ స్టిక్కర్లు, కిటికీ అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు ఉన్న వాటిని గుర్తించి జరిమానాలు వేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో నీరూస్‌ చౌరాస్తా దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ కార్లు అటువైపు వచ్చాయి..ఈ రెండు కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు ఉండటంతో పోలీసులు వీళ్లకు ఫైన్ వేశారు. మొదట అల్లు అర్జున్‌ కారు అద్దాలకు ఉన్న ఫిల్మ్ తొలగించి..తర్వాత రూ.700 జరిమానా విధించారు. ఆ తర్వాత అదే రూట్లో వచ్చిన కల్యాణ్‌రామ్‌ కారుకు కూడా ఇలాగే బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో అతనికి కూడా ఇలాగే ఫైన్‌ వేశారు.

shocking: Aamir Khan to Quit Films soon

megastar liplock chesina one and only heroine!