కృష్ణా నగరే మామ, కృష్ణా నగరే మామ, సినిమాయే లైఫ్ ర మామ, లైఫ్ అంత సినిమా మామ” ఈ పాట వింటున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారే గుర్తుకు వస్తారు. ఆయన జీవితం అంత సినిమాయే, సినిమాయే ఆయన జీవితం ఆయనకు మరో వ్యాపారం తెలియదు, వ్యాపకం లేదు, ఆయన జీవితం ఆసాంతం సినిమాయే. హీరో గ 350 చిత్రాల సుదీర్ఘ ప్రస్థానం, ఈ భూమి ఉన్నంత వరకు రాబోయే కాలం లో మరో హీరో ఈ రికార్డును చేరుకోలేరు, చేరుకోవటం కాదు కనీసం దరి, దాపులకు కూడా రాలేరు. ఇప్పటి తరం కుర్ర హీరోలు పడుతూ, లేస్తూ ఏడాదికి ఒక సినిమా చేయటం గగనం అయిన ఈ రోజుల్లో 350 చిత్రాలు నటించటం సాధ్యమా? నటుడిగా, స్టూడియో వ్యవస్థాపకుడిగా, నిర్మాత గ, దర్శకుడిగా ఎన్నో అరుదయిన రికార్డులు తన పేరున నమోదు చేసుకున్న కృష్ణ గారు చిరస్మరణీయులు. బ్రతికి ఉండగానే కాదు, చనిపోయాక కూడా అరుదయిన రికార్డు ను సృష్టించిన నటుడు కృష్ణ గారు. ఆయన వేదాంతి కాదు, సిద్ధాంత కర్త కాదు, ఆయన ఒక కర్మజీవి, ఫలితం గురించి ఆలోచించకుండా నిరంతరం శ్రమించిన ఒక శ్రామికుడు, అందుకే ఆయన అన్ని రికార్డులు సృష్టించారు, సృష్టిస్తూనే ఉన్నారు.
కృష్ణ గారి మరణానంతరం, విజయవాడ నవరంగ్ థియేటర్ వారు అరుదయిన పురస్కారం తో కృష్ణ గారికి నివాళి అర్పించారు, బహుశా మరే నటుడు ఇటువంటి నివాళి పొంది ఉండరు. కృష్ణ గారికి నివాళిగా ఒక రోజంతా నవరంగ్ థియేటర్ లోని ఒక సీట్ ను రిజర్వు చేసారు, ఆ సీట్ లో కృష్ణ గారి ఫోటో ఉంచి, పుష్ప గుచ్చాలు ఉంచి, అటు, ఇటు రెండు సీట్లు, వెనుక వరస లోని మూడు సీట్ లు, అంటే మొత్తం ఆరు సీట్ లో ఆ రోజంతా వేసే నాలుగు షోలకు అలాగే ఖాళీగా ఉంచారు. ఆ రోజంతా థియేటర్ ఓనర్ భూపాల్ ప్రసాద్, ప్రత్యేకంగా ఇద్దరు స్టాఫ్ ను నియమించి పొరపాటున కూడా కృష్ణ గారికి కేటాయించిన సీట్ లో గాని, ప్రక్కన , వెనుక ఉన్న సీట్ లలో ఎవరు కూర్చోకుండా జాగ్రత్త గ చూసారు. ఇదంతా ఒక నటుడిగానే కాదు ఒక మనిషిగా కృష్ణ గారు సంపాదించుకున్న ప్రేమ, అభిమానం. కృష్ణ గారి కంటే ఎక్కువ డబ్బు సంపాదించిన నటులు ఉండవచ్చు, కానీ ఇంత ప్రేమ, అభిమానం సంపాదించటం మరొకరికి సాధ్యమా? అందుకే ఆయన లైఫ్ సినిమా, సినిమాయే ఆయన లైఫ్, ఆయన ఇంటి పేరు బయోస్కోప్..!!