రంగ స్థలం షూటింగ్ టైం లో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న రాంచరణ్, ఈ విషయం స్వయం గ సుకుమార్ గారు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు, ఆ సమయం లో తాను అనుభవించిన నరాలు తెగిపోయే ఉత్కంఠ గురుంచి వారే స్వయం గ చెప్పారు. చిట్టి బాబు అన్నయ్య చనిపోయిన తరువాత, ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్న క్రమం లో చెట్టు, పుట్ట అన్ని గాలించిన చిట్టి బాబు గోదావరి లో వెళుతున్న లాంచీ లో ప్రెసిడెంట్ పారిపోతున్నాడు అనుకోని గోదావరిలో దూకి ఈదుకుంటూ లాంచీ వద్దకు వెళ్లి లాంచీ అంత గాలిస్తాడు. సుకుమార్ గారు లాంచీ ఇంజిన్ ఆపు చేసి ఉంచామన్నారు.
కానీ ఆ లాంచీ డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేసి ముందుకు పొనిస్తున్నాడు, గోదావరి లో దూకి ఈదుకుంటూ లాంచీ వద్దకు వెళుతున్న రాంచరణ్ వెనుక నీటిలో తిరుగుతున్న పెద్ద ఫ్యాన్ కు దగ్గరగా వెళిపోతున్నాడు, సీన్ లో లీనమయిపోయిన రాంచరణ్ అదేమీ గమనించకుండా ఈదుకుంటూ లాంచీ దగ్గరకు వెళుతున్నాడు, ఇదంతా చూస్తున్న సుకుమార్ గారు పెద్దగా అరుస్తున్నారు లాంచీ ఆపమని, ఎవరు ఇతని అరుపులు పట్టించుకొనే మూడ్ లో లేరు, అందరు సీన్ బాగా రావాలని లీనమయి పని చేస్తున్నారు, చిట్టి బాబు లాంచీ ఎక్కేంత వరకు సుకుమార్ గారి టెన్షన్ అంత ఇంత కాదు, రాంచరణ్ లాంచీ ఎక్కిన తరువాత దేవుడా అంటూ గట్టిగ ఊపిరి తీసుకున్నారట.ఆ విషయం అప్పుడు ఎవరికి తెలియదు తరువాత సుకుమార్ గారే ఈ సంఘటన గురించే చెప్పారు.