కొన్ని సార్లు నిజ జీవితం లో సంఘటనలు సినిమా లో ప్రతిబింబిస్తాయి , అలాగే కొన్ని సినిమాలో సంఘటనలు నిజ జీవితం లో జరుగుతుంటాయి అర్జున్ నటించిన” ఒకే ఒక్కడు” సినిమా లో అలసిపోయి ఇంటికి చేరిన అర్జున్ నిద్ర పోతున్నప్పుడు అతని నాన్న గారు అతని కాళ్ళు పడతారు. అటువంటి అరుదయిన సంఘటన చిరంజీవి గారి జీవితం లో కూడా జరిగింది. చిరంజీవి గారు రోజుకు త్రీ షిఫ్ట్స్ పని చేస్తూ, డూప్ లేకొండ ఫైట్స్ చేస్తూ, క్షణం తీరిక లేకొండ బిజీ గ ఉన్న రోజులు, పడుకోవటానికి ఒక గంట టైం దొరికితే చాలు అనుకునేంత బిజీ గ ఉన్న టైం లో ఒక రోజు ఇంట్లో ఆదమరచి నిద్రిస్తున్న చిరంజీవి గారి కాళ్ళ దగ్గర ఎదో అలికిడి, మేలుకున్న చిరంజీవి గారికి ఆశ్చర్యం, తన తండ్రి వెంకట్ రావు గారు చిరంజీవి గారి కాళ్ళు పడుతూ కూర్చొని ఉన్నారు. ఒక్క ఉదుటున లేచిన చిరంజీవి గారు కంగారుగా , ఇదేంటి నాన్న మీరు నా కాళ్ళు పడుతున్నారు అనగానే, పరవలేదులేరా నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయింది ఎప్పుడు షూటింగ్ అంటూ పరిగెడుతున్నావు, కాసేపు హాయిగా పడుకో నాన్న అంటూ స్వాంతన పలికారట. దీన్నే పుత్రోత్సాహం అంటారేమో, బిడ్డ పడుతున్న కష్టం చూసిన తండ్రి అంతకంటే గొప్ప సేవ ఏమి చేయగల