మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్రకు దొరికిన ఓ నూతన అధ్యాయం.. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హీరోగా నిలుదోక్కుకున్నాడు చిరంజీవి.. తనదైన నటన, డాన్స్, ఫైట్స్ తో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఒక్కో సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. అలాంటి చిరంజీవిని చూసి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో చిరు ప్రస్థానానికి నేటితో 42ఏళ్ళు నిండిపోయాయి..
చిరంజీవి మొదటి సినిమా ప్రాణంఖరీదు ఈ రోజున (సెప్టెంబర్ 22న 1978 )లో రిలీజ్ అయింది. కే వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని క్రాంతి కుమార్ తెరకెక్కించారు. జయసుధ హీరోయిన్ గా నటించింది. రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి పునాది రాళ్లు సినిమా చిరు తొలి సినిమా.. కానీ ప్రాణంఖరీదు చిత్రం మొదటగా విడుదలైంది.. మొదటి సినిమాకి గాను అక్షరాల 1,116 రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు చిరంజీవి.. అలా అలా 151 చిత్రాలను కంప్లీట్ చేశారు చిరంజీవి.. ప్రస్తుతం ట్విట్టర్ లో #42YearsForMegaLegacy అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది..