in

Chiranjeevi As Chief Guest On Balakrishna’s Aha Talk Show?

మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణలు ఇద్దరూ కలిసి ఏదైనా సినిమా వేడుకలో ఒకే వేదిక మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పండుగే. అలాంటిది బాలయ్య, చిరు కలిసి ఒకే షో లో కనిపిస్తే ఇంక మామూలుగా ఉండదు. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా రానున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి పాల్గొననున్నారట.ఈ టాక్​ షోలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ఇందులోని తొలి ఎపిసోడ్​లో మంచు మోహన్​బాబు అతిథిగా రానున్నారని మొదట్లో ప్రచారం జరిగింది.

కాగా.. ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి తొలి ఎపిసోడ్​లో అతిథిగా మెగాస్టార్​ చిరంజీవి సందడి చేయనున్నారని ఫిలింనగర్ ముచ్చటించుకుంటోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో చిరు-చరణ్​ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు ముందే.. బాలయ్య టాక్ షో లో మెగా హీరోలు సందడి చేయనున్నారు.

rgv offered liquor to Gandi Maisamma deity in the village!

payal rajput looks cute in black!