సీనియర్ నటుడు చంద్ర మోహన్ గారు, 1966 లో రంగులరాట్నం అనే చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసారు.అర్ధ శతాబ్దం పైగా నటిస్తున్న ఈ నటుడు, తాను హీరోగా బిజీ గ ఉన్న రోజుల్లో కూడా తనకు వచ్చిన ఏ పాత్రను వదులుకునే వారు కాదు, అది గెస్ట్ పాత్ర అయినా. సినీ పరిశ్రమ లో కాస్త లౌక్యం ఎక్కువ ఉన్న విలక్షణం అయిన నటుడు చంద్ర మోహన్ గారు. ఆయనకు ఒక చిత్రమయిన అలవాటు ఉండేది, ఆయన హీరో గ బిజీ గ ఉన్న రోజుల్లో ఆయన ఇంట్లో ఒక బ్లాక్ బోర్డు మీద ఆయన కాల్ షీట్ వివరాలు, అంటే ఏ రోజు ఏ షూటింగులో ఉంటారు, ఏ రోజు ఖాళీ గ ఉన్నారు అనే వివరాలు ఆ బోర్డు మీద వ్రాసి ఉంచే వారు.
ఆయనను కలవటానికి వచ్చిన వారు అయన ఖాళీగా ఉన్న రోజుల్లో ఏదైనా క్యారెక్టర్ రోల్స్, గెస్ట్ రోల్స్ ఆయనకు ఆఫర్ చేసిన ఆయన వెంటనే ఒప్పుకొనే వారు. ఎప్పుడు ఖాళీ లేకుండా ఉండేందుకు అయన ఈ అలవాటు ఆయనకు చాల ఉపయోగపడింది అని చెప్ప వచ్చు. ఎవరయినా హీరో గ చేస్తున్నారు కదా చిన్న, చిన్న పాత్రలు ఎందుకు ఒప్పుకుంటున్నారు అని అడిగితే, ఖాళీ గ ఇంట్లో కూర్చుంటే ఏమి వస్తుంది, ఆ పాత్రలు ఒప్పుకుంటే టైం పాస్, మరియు డబ్బులు వస్తాయి అంటూ లౌక్యం గ సమాధానం చెప్పే వారు. పాత్ర చిన్నదయినా, పెద్దయిన మనసు పెట్టి నటించేవారు, అందుకే ఆయన అర్ధ శతాబ్దానికి పైగా సినీ పరిశ్రమలో కొనసాగగలిగారు, గిరి గీసుకొని ఉంటె ఎప్పుడో తెర మరుగయి పోయి ఉండే వారు. బ్లాక్ బోర్డు మీద తన కాల్ షీట్ వివరాలు వ్రాసే చిత్రమయిన అలవాటు, ఎంత విలక్షణం గ ఉపయోగ పడిందో చూడండి.