విజయ్ దేవరకొండ, రౌడీ ఫెలో ఆన్ సిల్వర్ స్క్రీన్, అత్యంత వేగం గ ఎదుగుతున్న యువ కధానాయకుడు. ఎక్కడో ఒక ఇంటర్వ్యూ లో ఆయన సినిమా యాక్టర్ అవటానికి కారణం చాల ఫ్రాంక్ గ చెప్పారు. చాలామంది లాగా డాక్టర్ అవుదామనుకుని యాక్టర్ అయ్యాను , అనుకోకుండా యాక్టర్ అయ్యాను వంటి కహాని లు చెప్పకుండా తన మనసులో మాట ఉన్నది ఉన్నట్లు చెప్పారు. తెలిసి తెలియని చిన్న వయసు లో బస్సు డ్రైవర్ అవ్వాలి అనుకున్నారట, అంత పెద్ద వెహికల్ నడపటం చాల గ్రేట్ అని ఫీల్ అయి ఆలా అనుకోని ఉండ వచ్చు. విజయ్ ఇంటర్, లిటిల్ ఫ్లవర్స్ కాలేజీ, ఉప్పల్ లో చదివారు. ఉండేదేమో శ్రీనగర్ కాలనీ కాలేజీ ఏమో ఉప్పల్, రోజు కాలేజీ బస్సు లో వెళ్లే విజయ్ కి ఎప్పుడయినా బస్సు రాని రోజు సిటీ బస్సు ఎక్కి కాలేజీ కి వెళ్ళాలి అంటే తలా ఇబ్బంది పడే వారు.
ఎందుకంటే మన వాడు భౌగోళిక శాస్త్రం లో చాల వీక్, అంటే అర్ధం కాలేదు కదు,రూట్ లు సరిగా తెలియదు మన వాడికి. సిటీ బస్సు నంబర్స్, రూట్ లు తెలుసుకొని ఎక్కడికయినా వెళ్లాలంటే చాల నరకం గ అనిపేంచేదట. అందుకే ఈ బస్సులు, రూట్లు ఇటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా కారులో తిరగాలి అంటే, ఎలాగైనా సినిమా యాక్టర్ అవ్వాలి, అప్పుడు బోలెడన్ని కార్లు కొనుకోవచ్చు అనుకున్నారట. అప్పుడు మనసులో పడిన దాన్ని కష్టపడి సాధించారు విజయ్ దేవరకొండ. ట్రాఫిక్ జామ్స్ వలన కారులో ప్రయాణం చేయటం ఇబ్బంది గ ఉండటం వలన హెలికాఫ్టర్ వంటిది కొనుక్కొనే స్థాయి కి ఎదగాలని కోరుకుందాం.కలలు అందరు కంటారు కానీ దానిని సాకారం చేసుకోగలిగిన వారు కొందరే ఉంటారు.