in

buzz: Prashanth Neel Pan India Movie With Nani!

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉగ్రమ్` అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ క‌న్న‌డ డైరెక్ట‌ర్‌.. `కేజీఎఫ్‌`తో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. 2018లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`, మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `కేజీఎఫ్‌ చాప్ట‌ర్ 2` చిత్రాలు ఎంతటి భారీ విజ‌యాల‌ను సాధించాయో తెలిసిందే. కేజీఎఫ్ తో నేష‌న‌ల్ వైడ్‌గా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌డంతో పాటు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచాడు ప్ర‌శాంత్ నీల్‌.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో `స‌లార్‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తైన త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయ‌నున్నాడు. `ఎన్టీఆర్ 31` వ‌ర్కింగ్ టైటిల్‌తో వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. వీటితో పాటు ప్ర‌శాంత్ నీల్ చేతిలో మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.

అయితే ఇంత బిజీగా ఉన్న ఆయ‌న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నానితో ఓ మూవీ చేయ‌నున్నాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది కూడా పాన్ ఇండియా చిత్ర‌మే అని, ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్‌-నానిల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని అంటున్నారు. అస‌లు ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం జోరుగా వైర‌ల్ అవుతోంది. ఒక‌వేళ ఈ వార్తే నిజ‌మై ప్ర‌శాంత్ నీల్, నాని కాంబోలో ఓ మూవీ ప‌ట్టాలెక్కితే.. సౌత్ స్టార్ హీరోలంద‌రికీ మైండ్‌బ్లాక్ అవ్వ‌డం ఖాయం..

actress pavani reddy cute stills on sofa!

director krish turns producer for an exciting web series!