in

brahmanandam’s special role gopichand ‘seetimaar’!

సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం అంటేనే తెలుగు మొహాల్లో నవ్వులు పూస్తాయి. అయితే ఆయన కామెడీ టైమింగ్ ను ఆస్వాదించి చాల కాలం అయింది. అయితే యంగ్ కమెడియన్స్ రాకతో ఈ సీనియర్ కి అవకాశాలు తగ్గాయి. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం గోపీచంద్‌ ప్రస్తుతం చేస్తోన్న ‘సిటీమార్’లో బ్రహ్మానందంకి అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ దొరికిందని తెలుస్తోంది. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని.. ఆ పాత్రలోనే బ్రహ్మానందం నటిస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి చాల కాలం తరువాత బ్రహ్మానందంకి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికింది. మరి బ్రహ్మానందంకి ఈ చిత్రంతో దశ తిరుగుతుందేమో చూడాలి..

Prabhas teams up with KGF director for his next!

Pooja Hegde Signs Her Next With Dulquer Salmaan!