
నిజ జీవితం లో తనికెళ్ళ భరణి గారికి, బ్రహ్మానందం గారికి ఎదురయినా ఒక విచిత్రమయిన అనుభవం.మన నటులు ఎక్కడకు వెళ్లిన వాళ్లకు ఎంతో గుర్తింపు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడటానికి, చూడటానికి జనం ఎగబడతారు.ఆ విధమయిన వాతావరణానికి అలవాటుపడిన వీరిద్దరూ, ఒక సినిమా షూటింగ్ సందర్భం గ ఒక చిన్న పల్లెలో దేవాలయానికి వెళ్లారు, అందులో పూజ చేస్తున్న పూజారి గారు, వీరిద్దరిని చూసి పెద్దగా రియాక్ట్ అవకుండా తన పని పూర్తి చేసుకొని వచ్చారట. వీళ్ళిద్దరిలో అహం కాస్త దెబ్బ తినింది, అభిషేకం చేయమని అడిగేతే, రేపు ఉదయాన్నే రండి అన్నారట, దెబ్బకు వీళ్లకు దిమ్మతిరిగింది. మరుసటిరోజు ఉదయం వెళ్లారట, చాల పద్దతి గ అభిషేకం చేశారట, దక్షిణ ఇవ్వబోతే హుండీ చూపించారట, బయటకు వెళ్లిన వీరిద్దరూ టిఫిన్ చేస్తూ గుడి మూసుకొని వెళుతున్న పూజారి గారిని స్వామి టిఫిన్ చేయండి అని అడిగారట, వద్దన్నారు, టీ తాగమన్న అదే సమాధానము, వీరిద్దరికి మతి పోయింది, ఏవిటండి ఏది అడిగిన వద్దంటున్నారు, ఇందాక దక్షిణ ఇవ్వబోతే హుండీ చూపించారు అని అడిగారట, అందుకు ఆ పూజారి గారు, సార్ నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, శివుడున్నాడు అని సమాధానం ఇచ్చి వెళ్లిపోయారట. ఏమి ఆశించకపోవటం లో ఉన్న గొప్పతనం, వాళ్ళ కళ్ళకు నిలువెత్తు శ్రీమంతుడు కనిపించాడట ఆయనలో. మంచి కవి అయినా భరణి గారు ఆయన వ్యక్తిత్వానికి ఆశ్చర్యానికి లోనై” అతని ప్రవర్తన తో మాలోని అహం మా కాళ్ళ మీద కుప్పలా పడింది” అని వ్రాసుకున్నారు.నిజమే అంత నిష్కామ కర్ముడిగా బ్రతకటం ఒక తపస్సు వంటిది.

