బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జోడి కడుతున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్. ఇందులో వీరిద్దరి మధ్య మంచి రొమాన్స్, కెమిస్ట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే…
సోషల్ మీడియాలో వచ్చే విషయాలు చాలా వింతగా ఉంటాయి. ఇప్పుడు జాన్వీ గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లి కాకముందే జాన్వీ కపూర్ ప్రెగ్నెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. జాన్వీ కపూర్ నిజంగానే ప్రెగ్నెంట్ అయిందని…గతవారం రోజుల కిందట ముంబైలో అబార్షన్ కూడా చేయించుకుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు సందు. దీనికి కారణం జాన్వీ కపూర్ ప్రియుడు షికార్ పహరియా అని కూడా తెలిపాడు సందు. అయితే జాన్వి కపూర్ పై వస్తున్న వార్తలపై ఆమె తండ్రి బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. తన కూతురిపై వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన చెప్పాడు..!!