in

BOMBAY CHINNOLLU YEKKADA ??

27 సంవత్సరాల క్రితం మణిరత్నం దర్శకత్వం వహించిన బొంబాయి సినిమా లో ” కుచ్చి కుచ్చి కున్నమ్మ ” అంటూ సందడి చేసిన ముద్దులొలికే కవలలు హృదయ్, హర్ష ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు డైరెక్టర్ జంధ్యాల గారి స్నేహితుడి పిల్లలు, జంధ్యాల గారి కో డైరెక్టర్ అయినా ఫణి గారు,మణిరత్నం గారి టీం లో పని చేయటం వలన ఈ పిల్లలను మణిరత్నం గారికి చూపించటం, వీరిని చూసిన వెంటనే మణిరత్నం గారు ఒకే చెప్పటం జరిగింది. వీరిద్దరూ ఆ తరువాత పెద్దగా ఎక్కడ సినిమాలలో కనిపించలేదు. హృదయ్ మాత్రం బొంబాయి తరువాత వెంకటేష్ తో “ప్రేమించుకుందాం రా ” చిత్రం లో నటించాడు.

ఆ తరువాత ఇద్దరు చదువుల మీద దృష్టి పెట్టారు, హర్ష కి సినిమాల మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు, కానీ అతని కంటే మూడు నిముషాలు చిన్న వాడయినా హృదయ్ యాక్టింగ్ ని కెరీర్ గ ఎంచుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన హృదయ్ యాక్టింగ్ స్కూల్ లో ట్రైన్ అయ్యాడు ఆ తరువాత 2020 లో తమిళ్ లో ఒక లవ్ స్టోరీ లో నటించాడు.హర్ష కి యాక్టింగ్ మీద పెద్ద ఇంటెరెస్ట్ లేక పోవటం తో అమెరికా లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. చిరంజీవి కి వీర అభిమాని ఐన హృదయ్ తెలుగు సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. బెస్ట్ అఫ్ లక్ హృదయ్..!!

‘Agent’ beauty Sakshi Vaidya signs three mega projects!

Karthikeya 2 Director And Mega Hero – Confirmed?