in

Bollywood star Tiger Shroff To Join Allu Arjun Atlee’s AA22 x A6?

ల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో “టైగర్” ష్రాఫ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో “టైగర్” ష్రాఫ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మరి “టైగర్” ష్రాఫ్ నిజంగానే నటిస్తున్నాడా ?, నటిస్తే ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కూ అట్లీ రాసిన స్క్రిప్ట్ లు అన్నింటికీ కంటే ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నంగా ఉండబోతుందట.

మరోవైపు ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట..!!

f cube ‘nidhi agarwal’

Chiranjeevi recently underwent a minor knee surgery?