in

Bigg Boss Beauty Ashu Reddy turns into heroine!

తెలుగు పాపులర్ ఓటీటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ లో ప్రజెంట్ అషురెడ్డి కంటెస్టెంట్ గా ఉంది. కాగా, ఈమె టాప్ ఫైవ్ లో ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, చివరి వరకు ఉండి టైటిల్ విన్ అయే చాన్సెస్ ఈమెకు ఏ మేరకు ఉన్నాయి? అనేది ఆమె ఆట తీరును బట్టి డిసైడ్ అవుతుంది. కాగా, ‘ఫోకస్’ మూవీ మేకర్స్ అషురెడ్డికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అషురెడ్డి హౌజ్ లో ఉన్నప్పటికీ ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఫోకస్’ చిత్రంలోని ఫస్ట్ లుక్ ను బుధవారం విడుదల చేశారు. యంగ్ హీరో విజయ్ శంకర్ హీరో కాగా, హీరోయిన్ గా అషురెడ్డి నటించారు.

సుహాసిని మణిరత్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్రల్లో నటించడం విశేషం. ఈ పిక్చర్ కు జి. సూర్యతేజ దర్శకత్వం వహించగా, ఫిల్మ్ స్టోరి మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కు చక్కటి స్పందన వచ్చింది. ఇందులో అషురెడ్డి తొలి సారి పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసింది. ఈమె లుక్ ను మహిళా భద్రతా విభాగం డీఐజీ బి.సుమతి విడుదల చేశారు. మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని దర్శకులు సూర్యతేజ తెలిపారు. పిక్చర్ ను స్కైరా క్రియేషన్స్ సమర్పణంలో రిలాక్స్ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

balakrishna, b gopal cinema ante mass audience ku pandage!

megastar wants icon star in ‘chantabbai’ remake!