హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను “గిప్పని ఇస్తా” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని యుట్యూబ్ నటి సరయు అన్నారు. ఇటీవల ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టాను.. నేను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని ఆమె అన్నారు.
నేను హిందువుల మనోభావాల్ని దెబ్బతీసాను అంటూ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ‘గిప్పని ఇస్తా’ అనే షర్ట్ ఫిల్మ్ లో అభ్యంతరకర సన్నివేశాన్ని మేము డిలీట్ చేసామని ఆమె వెల్లడించారు. మేము సిరిసిల్లలోని విశ్వ హిందూ పరిషత్ వారిని కాంటాక్ట్ చేయడానికి గతంలో ట్రై చేసాము కానీ వారు మాకు కాంటాక్ట్ లోకి రాలేదని ఆమె తెలిపారు. ‘గిప్పని ఇస్తా’ అనే షార్ట్ ఫిల్మ్ కంటెట్ లో మేము తీసిన ఆ సన్నివేశం ఓ సినిమా రిఫరెన్స్ ఆధారంగా తీశామని ఆమె పేర్కొన్నారు. ఓ హోటల్ ప్రమోషన్ లో భాగంగా షూట్ చేసామని, దయచేసి నన్ను క్షమించండి అని ఆమె తెలిపారు.