భాస్కర్ కి బొమ్మరిల్లు సినిమా డైరెక్షన్ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? దిల్ రాజు గారు నిర్మిస్తున్న ఆర్య చిత్రానికి సుకుమార్ డైరెక్టర్ అయితే భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్, షెడ్యూల్ ప్రకారం కేరళలో షూటింగ్ పూర్తి చేసుకొని బయలుదేరటానికి రిటర్న్ టిక్కెట్లు కూడా బుక్ చేసి ఉన్నాయి, షూటింగ్ షెడ్యూల్ కి ఒక్క రోజే మిగిలి ఉంది కానీ 46 షాట్లు పెండింగ్ ఉన్నాయి. ఉన్న ఒక్క రోజులో పూర్తి చేయటం అసాధ్యం, టిక్కెట్లు కాన్సల్ చేసి షూటింగ్ కంటిన్యూ చేయాలి అని దిల్ రాజు గారు టెన్షన్ పడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ని సలహా అడిగారు దిల్ రాజు గారు, సుకుమార్ ఎదో చెప్పే లోపు భాస్కర్ చొరవ తీసుకొని, నో వర్రీ సర్ మేము నైట్ కూర్చొని ప్లాన్ చేసి రేపు 46 షాట్లు చేసేస్తాం, మనం అనుకున్నట్లుగానే కేరళ నుంచి బయలుదేరుతాం అని భరోసా ఇచ్చేసాడు భాస్కర్.
చెప్పినట్లుగానే నైట్ అంత కూర్చొని సుకుమార్ , భాస్కర్ వర్క్ షీట్ తయారుచేసుకున్నారు, ప్లాన్ ప్రకారం 46 షాట్లు పూర్తి చేసేసారు. భాస్కర్ లోని చురుకుదనాన్ని గుర్తించిన దిల్ రాజు గారు, స్టోరీ తయారు చేసుకో నెక్స్ట్ మూవీ డైరెక్టర్ నువ్వే అనేసారు. హైదరాబాద్ వచ్చాక” హౌ టు లూస్ ఆ పర్సన్ ఇన్ 10 డేస్ “అనే, ఇంగ్లీష్ మూవీ డి.వి.డి. చేతిలోపెట్టి దాన్ని బేస్ చేసుకొని కథ రెడీ చేయమన్నారు, ఓ వారము తరువాత కథ తో రాజు గారిని కలిసాడు భాస్కర్, కొన్ని మార్పులు చెప్పారు రాజు. భాస్కర్ కి తృప్తి గ లేదు, ఎన్నో ఏళ్ళు గ తన మదిలో మెదులుతున్న ఒక తండ్రి, కొడుకుల పాయింట్ మీద ఒక సెన్సిటివ్ సబ్జెక్టు ను రెడీ చేసి రాజు గారికి చెప్పటం జరిగింది, ఆయనకు విపరీతంగ నచ్చేసింది, తెలుగు తెర కు భాస్కర్ ను డైరెక్టర్ గ పరిచయం చేసింది బొమ్మరిల్లు సినిమా.