సూర్య, జ్యోతికలది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే, కానీ వివాహానికి ముందు సూర్య గారి అమ్మగారు జ్యోతిక కు మాత్రం ఒక కండిషన్ పెట్టారట. సూర్య గారి నాన్న గారు శివ కుమార్ కూడా తమిళంలో మంచి పేరున్న నటుడు, సంప్రదాయం , క్రమశిక్షణకు మారు పేరు శివ కుమార్ గారు. సూర్య, జ్యోతికల ప్రేమకు పచ్చ జెండా ఊపడానికి నాలుగు సంవత్సరాలు టైం పట్టింది. అయినా ఎటువంటి తొందరపాటు లేకుండా ఎదురు చూసిన ఈ జంటకు, చివరకు ఒక రోజు తీపి కబురు చెప్పారు శివ కుమార్ దంపతులు. కానీ అత్తగారు జ్యోతికకు ఒక కండిషన్ పెట్టారు..
అదేమిటంటే సినిమాలలో నటించవద్దని అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆవిడ జ్యోతిక గారికి పెట్టిన కండిషన్ ఏమిటంటే, శివ కుమార్ గారికి, ఆమెకు హిందీ, ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి, నువ్వు తమిళ భాష నేర్చుకోవాలి అని, దానికి సమ్మతించి కోడలిగా వారింట అడుగు పెట్టిన జ్యోతిక మూడు నెలలు తిరగకుండానే చక్కటి తమిళం మాట్లాడటం నేర్చుకున్నారు, ఎంతగా అంటే, భర్త సూర్య కంటే చక్కటి తమిళం మాట్లాడి అత్తగారి మనసు దోచుకున్న గడుసు కోడలు జ్యోతిక.