in

Bhagyashree Borse becomes the new crush for telugu people!

భాగ్యశ్రీ బోర్సే, ఇప్పుడు ఈ పేరు కుర్రకారు నోళ్లల్లో నానుతోంది. ఆకర్షణీయమైన ఆమె రూపం అటు హంసలతోను..ఇటు నెమళ్లతోను పోటీపడుతూ ఉంటుంది. చందమామలాంటి ఈ అమ్మాయికి విశాలమైన కళ్లే ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. పూజ హెగ్డే..రష్మిక..కీర్తి సురేష్ టాలీవుడ్ కి గ్లామర్ డోస్ ఇస్తున్న సమయంలో, కృతి శెట్టి – శ్రీలీల చాలా వేగంగా తెలుగు తెరను ఆక్రమించారు. తొలి సినిమాలతోనే భారీ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు..

అయితే ఈ రెండు వరుసలలోని హీరోయిన్స్ లో కొంతమందికి వరుస ఫ్లాప్ లు పడటం..మరికొందరికి గ్యాప్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఇక్కడి యూత్ కళ్లలో పడింది. వెండితెరకి కొత్త పండుగ తెచ్చినట్టుగా భాగ్యశ్రీ కనిపించడంతో, కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. యూత్ లో ఆమెకి గల క్రేజ్, ఇప్పుడు వరుస అవకాశాలు తెచ్చిపడేస్తోంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ సుందరి వరుస సినిమాలలో సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి..!!

Ravi Teja Meenakshi Chaudhary kiss controversy!