in

best comebacks of tollywood heroes in 2021!

ఏడాది థియేటర్, ఓటిటి ఇలా మొత్తం కలుపుకుని 300కి పైగా సినిమాలు విడుదల అయ్యాయి.అయితే థియేటర్లలో విడుదలైన సినిమాలు 150వరకు ఉన్నట్టు అంచనా. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. 2021 కి ముందు వరకు ప్లాప్ లతో సతమతమైన కొంతమంది హీరోలు ఈ ఏడాది గట్టెక్కేసారు. ఈ ఏడాది కంబ్యాక్ ఇచ్చిన హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

రవి తేజ : ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

అల్లరి నరేష్ : గత 7,8 ఏళ్లుగా నరేష్ ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. సపోర్టింగ్ రోల్ చేసిన ‘మహర్షి’ తప్ప అతనికి చెప్పుకోడానికి మరో హిట్టు లేని నేపథ్యంలో ఈ ఏడాది ‘నాంది’ చిత్రంతో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ గత చిత్రాలు అన్నీ డిజాస్టర్లే..! అయితే ‘పింక్’ రీమేక్ గా వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకుంది. కానీ టికెట్ రేట్ల ఇష్యు మరియు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ పడడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఏదేమైనా పవన్ కంబ్యాక్ ఇచ్చాడు.

శ్రీ విష్ణు : ‘తిప్పరా మీసం’ ‘గాలి సంపత్’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది వచ్చిన ‘రాజ రాజ చోర’ చిత్రంతో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

వెంకటేష్ : ‘నారప్ప’ తో నిరాశపరిచిన వెంకటేష్ ‘దృశ్యం2’ తో మంచి ఫలితాన్నే అందుకుని కంబ్యాక్ ఇచ్చాడు. ఇవి రెండు ఓటిటిలోనే విడుదలయ్యాయి.

బాలయ్య : ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న బాలయ్య.. ‘అఖండ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి.. కంబ్యాక్ ఇచ్చాడు.

నాని : ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘వి’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలతో నిరాశపరిచిన నాని.. ‘శ్యామ్ సింగ రాయ్’ తో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

I was tired of doing glamor roles, says samantha!

This Will Be My First And Last Item Song, Says Regina!