in

Bellamkonda Srinivas to romance Nushrat Bharucha in Chatrapathi remake!

తెలుగులో బెల్లంకొండను పరిచయం చేసిన వివినాయకే బాలీవుడ్‌లోను పరిచయడం చేయడం విశేషం‌.. ఇక అక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా విజయేంద్రప్రసాద్‌ ఈ రీమేక్‌లో మార్పులు చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా 2005లో ప్రభాస్ హీరోగా రాజమౌళి ఛత్రపతిని తెరకెక్కించారు. ఇందులో శ్రియ హీరోయిన్‌గా నటించగా.. భానుప్రియ, షమీ, ప్రదీప్‌ రావత్‌, జయ ప్రకాష్‌ రెడ్డి, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు.

ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు ప్రభాస్‌కి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకూడా బెల్లంకొండపై సక్సెస్ తెచ్చిపెడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారట చిత్రయూనిట్. బాలీవుడ్ హాటీ నుష్రత్ బరుచాను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట చిత్రయూనిట్. ఈ ఆఫర్ ఆమెకు వచ్చడంతో నుష్రత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. నుష్రత్ 2010 లో విడుదలైన `తాజ్ మహల్` చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆతర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.

akansha puri at a press meet!

shraddha das stunning hot photoshoot!