in

beauty queen Janhvi Kapoor signs another south film?

గ్రనటుడు విజయ్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటించనుందనే వార్త కోలీవుడ్‌లో హల్చల్‌ చేస్తుంది. ప్రస్తుతం విజయ్‌ ‘ది గోట్‌’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ తన 69 చిత్రంలో నటించనున్నారు. ఇందులో పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలకాలంలో జాన్వీ కపూర్‌ ఎక్కువగా ముంబై టు చెన్నై మధ్య చక్కర్లు కొడుతున్నారు.

చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని పుణ్యస్థలాలను సందర్శిస్తోంది. అయితే, తన తల్లి శ్రీదేవి నిలదొక్కుకున్న తమిళంలో తాను ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరో వైపు జాన్వీ కపూర్ ఇప్పటికే సౌత్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోనూ.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC16 చిత్రంలోనూ ఆమె అవకాశం సొంతం చేసుకుంది..!!

malavika menon opens up about doing intimate scenes!

unlike others samantha giving more preference to web series!