ఇటీవల బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్లా అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల సిద్దార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. ఆయన మరణవార్త విని బాలీవూడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సినిమా తారలంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు.
వారితోపాటు కృతిసనన్ కూడా అక్కడకు వెళ్లారు..అయితే కృతి సనన్ వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న మీడియా ఆమె పై ఒక్కసారిగా ఫోటోల వర్షం కురిపించారు. మైకులతో మీద పడ్డారట. దాంతో కృతిసనన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చావు వద్దకు వెళ్లిన సమయంలో మీడియా అత్యుత్సాహం చూపించడం కరెక్ట్ కాదు అని అంది. ఆ విషయమై కృతి స్పందిస్తూ.. మీడియా హద్దుల్లో ఉండాలి.
తమకు తాము హద్దులు పెట్టుకుని ఉండాలి. అంత్యక్రియలు వార్త కాదు.. వినోదం అంతకంటే కాదు. దయచేసి అలాంటివి కవర్ చేసేందుకు ప్రయత్నించడం మానుకోండి. బాధల్లో ఉన్న వారి మొహాల్లో కెమెరా ఫ్లాష్ పెట్టి ఫోటోలు తీయడం.. మాట్లాడించేందుకు ప్రయత్నించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేసింది కృతి సనన్.