ఒకప్పుడు కమెడియన్గా తెలుగు వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్ తర్వాత పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి సినిమాల్లో నటించడం తగ్గించిన బండ్ల నిర్మాతగా సెటిలైపోయాడు. అయితే బండ్ల గణేశ్ తాజాగా తెరపై హీరోగా అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ తమిళ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాలీవుడ్లో టాక్.
అంతేకాదు ఇందులో ఏకంగా లీడ్ రోల్ పోషించేందుకు బండ్ల సన్నాహాలు చేస్తున్నాడట. తమిళంలో వచ్చిన ‘మండెల’ మూవీ విడుదలైన తర్వాత పలు వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఎంతటి స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చిందో అంతే రేంజ్లో సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీని బండ్ల తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఎలాగైన ఈ మూవీని తెలుగు తెరపైకి ఎక్కించేందుకు తెలుగు హక్కుల కోసం ఆయన కాస్తా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.