in

balayya’s heroine muskan seth roped in for dr. Rajasekar’s next?

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కొన్నేళ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ కెమెరాను ఫేస్ చేయ‌బోతున్నారు. గ‌రుడ‌వేగ‌తో రీఎంట్రీ ఇచ్చి, ఆ త‌ర్వాత క‌ల్కి సినిమాలో న‌టించిన రాజ‌శేఖ‌ర్.. దాదాపు మూడేళ్ల విరామం తీసుకున్నాడు. క‌ప‌ట‌ధారి చిత్రానికి ముందు ఆయ‌నే హీరోగా ఎంపిక‌య్యాడు కానీ.. త‌ర్వాత ఏవో కార‌ణాల‌తో దాన్నుంచి త‌ప్పుకున్నాడు. ఆపై వీర‌భ‌ద్రం చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో అనుకున్న సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. కొన్ని నెల‌ల కింద‌ట క‌రోనా బారిన ప‌డి ఒక ద‌శ‌లో విష‌మ స్థితిని ఎదుర్కొని, త‌ర్వాత కోలుకున్న రాజ‌శేఖ‌ర్..

ఇప్ప‌ట్లో సినిమాలు చేస్తాడా అనుకున్నారు కానీ.. కొంచెం గ్యాప్‌లో మూడు సినిమాలు అనౌన్స్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడాయ‌న‌. ఆ మూడు సినిమాల్లో శేఖ‌ర్ కూడా ఒక‌టి. మ‌ల‌యాళ హిట్ మూవీ జోసెఫ్‌కు ఇది రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే…ఈ సినిమా కోసం నెరిసిన జుట్టు, ముడ‌త‌లు ప‌డ్డ ఛ‌ర్మంతో డీగ్లామ‌ర‌స్ అవ‌తారం ఎత్తాడు రాజ‌శేఖ‌ర్. ల‌లిత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ .ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్‌కు జోడీగా మ‌ల‌యాళ హీరోయిన్ అను సితార‌ను ఓకే చేశారు. ఈ సినిమాలో హీరో కూతురి పాత్ర కూడా చాలా కీల‌కం. దాని కోసం జార్జిరెడ్డి ఫేమ్ ముస్కాన్‌ను ఓకే చేసిన‌ట్లు తెలిసింది.

shruthi haasan says no to fans requests!

jr ntr’s son abhai or bhargav to give cinema entry soon?