
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps] స్తుతం కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న నటసింహం బాలయ్య తన నెక్స్ట్ చిత్రం యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్‌ను అనుకుంటున్నారట. బెంగుళూరు కు చెందిన శ్రద్ధ నానితో కలిసి జెర్సీ మూవీ తొ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.