నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన నర్తనశాల సినిమా మధ్య లోనే ఆగిపోగా.. 14 ఏళ్ల తర్వాత అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ను సేవా పనుల కోసం బాలయ్య రీసెంట్ గా విజయ దశమి కానుకగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు, పే పెర్ వ్యూ పద్దతి లో 50 టికెట్ రేటుతో ఈ మినీ మూవీ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో పాటే ఇప్పుడు ఈ మినీ మూవీ కి కలెక్షన్స్ కూడా సాలిడ్ గా దక్కుతున్నాయని చెప్పొచ్చు. సినిమా కలెక్షన్స్ ని చారిటీ కోసం వాడుతా అని బాలయ్య చెప్పడం తో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ నే సుమారు..1 లక్షా 58 వేల దాకా జరుపుకోగా తర్వాత మొదటి రోజు మొత్తానికి ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా టికెట్ సేల్స్ సుమారు 1 లక్షా 95 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ మినీ మూవీ. ఇక దసరా వీకెండ్ 2 రోజుల మొత్తం మీద నర్తనశాల మినీ మూవీ.
సాలిడ్ వ్యూస్ దక్కాయి, రెండో రోజు సినిమా కి సుమారు 90 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం..అంటే పే పెర్ వ్యూ పద్దతిలో 50 టికెట్ రేటు తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొత్తం మీద 1 లక్షా 95 వేల టికెట్ సేల్స్ కి 97.5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూల్ చేయగా. రెండో రోజు 90 వేల టికెట్ సేల్స్ కి. 45 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 2 రోజుల్లో 2 లక్షల 85 వేల టికెట్ సేల్స్ జరగగా టోటల్ గా కలెక్షన్స్ 1 కోటి 42 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇది నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.